లివర్‌లో ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంటుంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, రెండోది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి. మొదటిది ఆల్కహాల్ తీసుకోనప్పటికీ ఇతర కారణాల వల్ల వస్తుంది. రెండోది ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల వస్తుంది. అయితే డాక్టర్ సూచన మేరకు వీటికి మందులను వాడుతూనే కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి నుంచి త్వరగా బయట పడవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
* తాజా కూరగాయలు, పండ్లను ఆహారంలో ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. దీని వల్ల లివర్ శుభ్రంగా మారుతుంది. నేరుగా తినలేమని అనుకునేవారు వాటిని సలాడ్స్ రూపంలో అయినా తీసుకోవచ్చు. నిత్యం వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల లివర్‌లో ఉండే చెడు పదార్థాలు బయటకు పోతాయి. ఫ్యాటీ లివర్ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.
* చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌కు ఎంతగానో మేలు చేస్తాయి. చేపలను తరచూ తినడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. వారంలో కనీసం 3 సార్లు అయినా చేపలను తింటే మంచిది.
* ఆలివ్ ఆయిల్‌ను తరచూ తీసుకోవడం వల్ల కూడా లివర్ సమస్యలు తగ్గుతాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నిత్యం 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం ఉత్తమం.
* అవకాడోలలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. అధిక బరువు పెరగకుండా చూస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు.
* వాల్ నట్స్, గ్రీన్ టీ, వెల్లుల్లి, పొద్దు తిరుగుడు విత్తనాలు, ఓట్స్, బ్రొకొలి వంటి పలు ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటుంటే లివర్ శుభ్ర పడుతుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ లోని కొవ్వు తగ్గుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది.