చంద్రబాబుకు వయాగ్రా అంటూ పేర్ని నాని దారుణ వ్యాఖ్యలు

-

చంద్రబాబు సవాలు హేతుబద్ధంగా లేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అమరావతి ని సింగపూర్, జపాన్ చేస్తానని చంద్రబాబు చాలా చెప్పారు కానీ ఏమీ చేయలేదన్న ఆయన ఆయన దేనికి సవాలు చేస్తున్నారో  ఎవరికీ తెలియదని అన్నారు. నిమ్మగడ్డ ఎవరికి కనిపించకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు, కరోన లేనప్పుడు ఎన్నికలు వాయిదా వేశారు ఇప్పుడు వాక్సిన్ వేసే సమయంలో ఎలా ఎన్నికలు నిర్వహించమని చెబుతారని అన్నారు. మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమన్న నాని నిమ్మగడ్డకు సుజనాచౌదరి, చంద్రబాబు రాజకీయాలు ముఖ్యం అని అన్నారు.

కోవిడ్ వాక్సిన్ డిసెంబర్ 25కు వచ్చే అవకాశం కనిపించటం లేదన్న అయన మరో రెండు వారాల సమయం పడుతుందని సమాచారం అందిందని అన్నారు. అనంతరం చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్లు చేశారు. ఏం పీకారని చంద్రబాబు అడుగుతున్నారని కించుకునే ధైర్యముంటే చంద్రబాబు స్టేలు ఎందుకు తెచ్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. లేటు వయస్సులో వయగ్రా ఎందుకు..? ఈ వయస్సులో వయగ్రా వాడితే గుండెపోటు వస్తుందని అంటూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news