కానిస్టేబుల్ తో లేడీ ఎస్సై ఎఫైర్.. కానిస్టేబుల్ భార్య మీద !

-

నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో ఒక లేడీ ఎస్సై తన స్టేషన్ లోనే పనిచేసే కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయి అనే కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ వ్యవహారం మీద జిల్లా ఎస్పీకి కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు చేసింది. దీంతో సదరు మహిళా ఎస్సైని దిశా పీఎస్ నుంచి వీఆర్ కు పంపించారు.

అయినా వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఆగకపోవడంతో కానిస్టేబుల్ భార్య మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో తన మీద పదే పదే ఫిర్యాదు చేస్తున్నారు అంటూ సదరు కానిస్టేబుల్ భార్య ఇంటికి వెళ్ళిన  మహిళా ఎస్సై రుబాబు ప్రదర్శించింది. అయితే ఈ విషయం మీడియాకు లీక్ కావడంతో మీడియా ప్రతినిధులు వెళ్లే లోపే సదరు మహిళా ఎస్సై జారుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news