పొద్దున్నపూట నిమ్మరసం కలిపిన నీళ్ళు తాగుతున్నారా..? ఐతే ఇది తెలుసుకోండి..

-

పొద్దు పొద్దున్న లేవగానే ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన నీళ్ళు తాగితే మంచిదని చెబుతుంటారు. అది కూడా కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగాలని అంటారు. ఐతే దీనివల్ల కలిగే లాభాలేంటో ఈ రోజు తెలుసుకుందాం. ఐతే నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్ళలో కొన్ని ఎండు మెంతులు వేసుకుంటే ఇంకా బాగుంటుందట. ఇది తాగడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగవడంతో పాటు కడుపులోపలి విషపదార్థాలు బయటకి వెళ్ళిపోతాయి.

నిమ్మరసం కలిపిన నీళ్ళు తాగడం వలన కలిగే లాభాలు

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. నిమ్మలో ఉండే నీటిశాతం వల్ల శరీరానికి సరైన పాళ్లలో నీరు అందుతుంది. అదీగాక నిమ్మలో విటమిన్ సి ఉంటుంది. దాన్లో ఉండే ఆంటిఆక్సిడెంట్ల వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటుంది. ఇంకా, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో బాగా ఉపయోగపడుతుంది. మలబద్దకం ఉన్నవారు నిమ్మరసం కలిపిన నీళ్ళు తాగితే మంచి ఉపశమనాన్ని పొందుతారు.

మెంతుల వల్ల కలిగే ఉపయోగాలు.

సాధారణంగా ప్రతీ ఒక్క వంటగదిలో ఉండే మెంతులు మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. దీనిలో విటమిన్లు, పోషకాలు, ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది. ఇది యాంటీడయాబెటిక్ గా పనిచేస్తుంది. శరీరంలో కొవ్వుని తగ్గించి గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూసుకుంటుంది. మలబద్దకం ఉన్నవారికి మెంతులు చేసే మేలు అంతా ఇంతా కాదు.

మలబద్దకం ఉన్నట్లయితే నిమ్మరసం కలిపిన నీళ్ళలో మెంతులు కూడా కలుపుకుని పొద్దున్న పూట ఖాళీ కడుపుతో సేవించండి. బరువు తగ్గాలనుకున్న వారు తమ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన పానీయం ఇది.

Read more RELATED
Recommended to you

Latest news