కన్నా తల్లి అంటే బిడ్డలను చాలా బాగా చూసుకోవాలి. కాని ఒక తల్లి మాత్రం తన కొడుకు ఏడుస్తున్నాడని నిప్పు పెట్టింది. మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. తన ఐదు నెలల పసికందును హత్య చేసిన కేసులో 27 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. నిందితురాలు సుఖర్ గ్రామ నివాసి గుడి సింగ్ గోండ్ (27) గా గుర్తించారు. ఆమె తన పసికందును నిప్పంటించి చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
చిత్రంగి పోలీస్ స్టేషన్ కి చెందిన ఒక అధికారి మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఆ మహిళ మానసికంగా అస్థిరంగా ఉంది అని ఈ నేరాన్ని అంగీకరించింది అని చెప్పారు. కొడుకుని చంపడం తనకు తెలియదు అని మహిళ చెప్పడం గమనార్హం. దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ఈ సంఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసిన నిందితుడి అత్తగారు సంచలన విషయం చెప్పారు.
ఇంట్లో ఉన్న కొడుకు ఏడుస్తున్నాడు అని ఆమె నిప్పు పెట్టిందని పేర్కొన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. నిందితురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, ఆమె తన కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత ఆమె భిన్నంగా ప్రవర్తించడం ప్రారంభించిందని చెప్పారు. ఆమెకు ఒక మాంత్రికుడు చికిత్స చేస్తున్నట్టు చెప్పారు. మాంత్రికుడి గురించి ఆమె చంపిందా…? అతను చంపమని చెప్పాడా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.