ఆర్ ఆర్ ఆర్: రాజమౌళి దసరాకే ఫిక్స్ అయ్యాడా..?

-

భారతీయ సినిమా ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎదురుచూస్తున్న సినిమా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్. రౌద్రం, రణం, రుధిరం అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరో రేంజిలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్, కొమరం భీం గా ఎన్టీఆర్ లుక్.. రెండూ విడుదల అవడంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఐతే కరోనా లేకపోయుంటే సంక్రాంతికి బొమ్మ థియేటర్లలో పడేదే. ప్రమోషన్ల సందడి ఎప్పుడో మొదలైపోయేదే. కానీ కరోనా వచ్చి ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ని ఆలస్యం చేసింది.

ఐతే లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దసరాకి విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. చిత్రీకరణ పూర్తవడానికే చాలా సమయం పట్టేలా ఉంది. అండువల్ల వేసవిని వదిలేస్తే, దసరా పండగకే ఆర్ ఆర్ ఆర్ ని ప్రేక్షకుల ముండుకు తీసుకురావాలని చూస్తున్నాడట. బాలీవుడ్ భామ ఆలియా భట్, హీరో అజయ్ దేవగణ్ ప్రముఖ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణీ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news