పడి లేచే మనసు కాపీ అంటున్నారే..!

-

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచేసింది. డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ చూశాక ఈ సినిమా కాన్సెప్ట్ సాయి ధరం తేజ్ సినిమాకు కాపీ అంటున్నారు. కరుణాకరణ్ డైరక్షన్ లో సాయి ధరం తేజ్ హీరోగా వచ్చిన సినిమా తేజ్ ఐలవ్యూ.

ఈ సినిమాలో హీరోయిన్ యాక్సిడెంట్ లో తన గతం మర్చిపోగా సాయి ధరం తేజ్ తో ప్రేమ కూడా మర్చిపోతుంది. అటుఇటుగా అదే స్టోరీతో శర్వానద్ పడి పడి లేచే మనసు సినిమా వస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ఫిదా భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా అలరించేలా ఉంది. క్రిస్ మస్ కానుకగా బరిలో అంతరిక్షం, కె.జి.ఎఫ్ సినిమాలు వస్తుండగా శర్వానంద్ కూడా పోటీలో నిలబడి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news