మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి బరిలో దిగుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగనుంది. జనవరి 4, 5 తారీఖులలో ఈ ఈవెంట్ జరుగనుందట.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య స్నేహం ఎలాంటిదో తెలిసిందే. ఇద్దరు కలిసి రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నారు. వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ ఈవెంట్ లో కె.టి.ఆర్ కూడా అటెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితో పాటుగా రాజమౌళి, రానాలు వినయ విధేయ రామ ఈవెంట్ లో పాల్గొంటారని తెలుస్తుంది. రంగస్థలం తర్వాత రాం చరణ్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.