న్యూ ఇయర్ వేడుకలు ఎందుకు బ్యాన్ చేయలేదు.. టీ సర్కార్ మీద హైకోర్టు సీరియస్

-

నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ రాష్ట్రం లో ఎందుకు బ్యాన్ చేయ లేదంటూ తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. మీడియాలో వచ్చిన కథనాలను చూసి సుమోటో గా విచారించిన హైకోర్టు, ఒక వైపు  డైరెక్టర్ పబ్లిక్ హెల్త్  కొత్త  వైరస్  మోర్ డేంజర్  అంటుంటే వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని హై కోర్టు ప్రశ్నించింది. న్యూ ఇయర్ వేడుకలకు పబ్ లు బార్ లు విచ్చలవిడిగా ఓపెన్ చేసి ఏం చేయలనుకుంటున్నారని హైకోర్ట్ ప్రశ్నించింది.

రాజస్థాన్, మహారాష్ట్ర లో వేడుకలు ఇప్పటికే బ్యాన్ చేశారన్న హైకోర్టు ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. కరోనా దృష్టిలో ఉంచుకుని వేడుకలు జరపద్దని ప్రజలకు సూచించామని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. ప్రభుత్వం ఈరోజు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు, భౌతిక దూరం, మాస్క్ లు తప్పకుండా వినియోగించాలని ఆదేశించింది. వేడుకలకు సంబంధించిన పూర్తి నివేదిక జనవరి7 న సమర్పించాలని హైకోర్ట్ ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news