న్యూ ఇయర్ ఎఫెక్ట్ : హైదరాబద్ లో భారీ ట్రాఫిక్ జామ్ లు

-

నూతన సంవత్సర వేడుకల హడావుడి అంతా మొదలయిపోయింది. బహిరంగ వేడులకలకు పర్మిషన్ లేదని పోలీసులు చెబుతున్నా జనాలు ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే ఆఫీసులకు వెళ్ళిన అందరూ ఇళ్ళకు చేరుకునే పనిలో ఉన్నారు. అందుకే ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ లు అయ్యాయి. దాదాపుగా అన్ని హైదరబాద్ లోని అన్ని ప్రధాన కూడళ్ళలో ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక నగరంలో వైన్ షాపుల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

వైన్ షాపుల ముందు గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారు. భారీగా మద్యం సేల్స్ నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక బార్లకు కూడా రద్దీ బాగా పెరిగింది. ఇక హైదరాబాద్ పోలీసులు కొద్ది సేపటిలో ఫ్లై ఓవర్ లు అన్నిటినీ మూసివేయనున్నారు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇళ్ళకు వెళ్ళాల్సిన వారు ఎవరైనా ఉంటే త్వరగా ఇళ్ళకు చేరుకొండి.  

 

Read more RELATED
Recommended to you

Latest news