పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించే గ్రీన్ టీ..!

-

మ‌న శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపే ప‌ర్‌ఫెక్ట డ్రింక్‌గా గ్రీన్ టీ ప‌నిచేస్తుంది. దీన్ని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఒక‌ప్పుడు కేవ‌లం సెల‌బ్రిటీలు మాత్ర‌మే గ్రీన్ టీ తాగేవారు. కానీ ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ గ్రీన్ అందుబాటులో ఉంది. గ్రీన్ టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గ్రీన్ టీలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతాయి. ద‌గ్గు, ఫ్లూ జ్వ‌రం త‌దిత‌ర వ్యాధుల నుంచి ఇవి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి.

అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించ‌డంలో గ్రీన్ టీ అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. గ్రీన్ టీలో అస‌లు క్యాల‌రీలు ఉండ‌వు. అంతేకాకుండా గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో ఇత‌ర ఆహారాల‌పై ఆస‌క్తి త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు ఉపయోగ‌ప‌డుతుంది. గ్రీన్ టీ లో కాటెకిన్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. నిత్యం 2 నుంచి 3 క‌ప్పుల గ్రీన్ టీ ని తాగ‌డం అల‌వాటు చేసుకుంటే పొట్ట ఫ్లాట్ అవ‌డం ఖాయం అని సైంటిస్టులు చెబుతున్నారు.

గ్రీన్ టీ లో పాలీఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీర మెట‌బాలిజాన్ని పెంచుతాయి. దీంతో మ‌న శ‌రీరం క్యాల‌రీల‌ను త్వ‌ర‌గా ఖ‌ర్చు చేస్తుంది. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర మెట‌బాలిజం రేటు 4 శాతం వ‌ర‌కు పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. గ్రీన్ టీలో చ‌క్కెర కాకుండా తేనె క‌లుపుకుని తాగితే ఇంకా అద్భుత‌మైన లాభాలుంటాయి. అయితే గ్రీన్ ఎంత ఆరోగ్య‌క‌రం అయినప్ప‌టికీ దాన్ని మోతాదుకు మించి సేవించ‌రాదు. గ్రీన్ టీ అధికంగా తాగితే డీహైడ్రేష‌న్‌, అసిడిటీ పెరుగుతాయి. క‌నుక గ్రీన్ టీని మోతాదులో తాగితే అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news