పతంగి ఎగరేస్తూ టీఆర్ఎస్ సీనియర్ నేత మృతి

-

సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందిస్తారు. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఈ కల్చర్ బాగా ఎక్కువ అని చెప్పాలి. చిన్నపిల్లలు మాత్రమే కాకుండా పెద్ద వాళ్లు సైతం ఈ పతంగులు ఎగురవేస్తూ ఆనందిస్తూ ఉంటారు. అయితే ఈ పతంగులు ఎగురవేసేప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నా అందరూ పెడచెవిన పెడుతున్నారు.

అలా పెడచెవిన పెట్టిన ఒక సీనియర్ టిఆర్ఎస్ నేత ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో నెలకొంది. గాలిపటం ఎగర వేస్తూ ఒక టిఆర్ఎస్ నేత మృతి చెందాడు. హైదరాబాద్ లోని చిక్కడపల్లి చెందిన బంగారు కృష్ణా అనే టిఆర్ఎస్ నేత గాలిపటం ఎగర వేస్తూ మూడో అంతస్తు నుంచి అనుకోకుండా కిందకి పడి పోయాడు. పైకి గాలిపటం ఎగర వేస్తూ కిందకి చూసుకోకుండా నడుస్తూ రావడంతో ఆయన అక్కడి నుంచి కింద పడి పోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news