విగ్రహాలపై దాడులు చేయిస్తూ గోవులకు పూజలు చేస్తే పాపం పోద్దా ?

-

ఏపీ వ్యాప్తంగా ఈరోజు హిందువులు దేవతగా భావించే గోవులకు గోపూజా మహోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా గోపూజ మహోత్సవం జరుగుతోంది. నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో జరిగే గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానాలు (టీటీడీ), దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో కామధేను పూజ (గోపూజ) జరగనుంది. ఈ అంశం మీద టీడీపీ నేత బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవు మాంసం తినేవాళ్ళు గోవు పూజ చేయడం ఓట్ల కోసం కాదా? అని అయన ప్రశ్నించారు.

దేవాలయలపై దేవత విగ్రహాలపై దాడులు చేయిస్తూ గోవులకు పూజలు చేస్తే పాపం పోద్దా అని ఆయన ప్రశ్నించారు. చరిత్రలో ఎప్పుడు దేవాలయలపై ఇన్ని దాడులు జరిగినట్టు చూడలేదన్న ఆయన వైసీపీ మద్దతుతోనే ఇన్ని దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇన్ని దాడులు జరిగినా ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. ఇది నిందితులకు వైసీపీ ఇస్తున్న మద్దతు కాదా ? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు గత ప్రభుత్వంలో సమర్థవతంగా పని చేయలేదా ? ఇప్పుడు ఎందుకు పని చేయటం లేదు ? అని ఆయన ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news