కార్పోరేట్ కంపెనీల్లో జాబ్ చేసేవాళ్ళు తెలుసుకోవాల్సిన నిజాలివే..

-

కార్పోరేట్ కంపెనీల్లో జాబ్ చేయాలని చాలామంది తపన పడుతుంటారు. దానికి కారణం అక్కడ ఇచ్చే జీతం ఒకటైతే, అక్కడ కనిపించే వర్క్ కల్చర్ రెండోది. ఐతే కార్పోరేట్ కంపెనీలన్నింటిలో వర్క్ కల్చర్ ఒకేలా ఉంటుందన్న గ్యారంటీ లేదు. కాబట్టి, ఏ కంపెనీలో ఎలా ఉండాలనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. కాకపోతే కార్పోరేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారో? అక్కడ పనిచేసేటపుడు ఏయే విషయాలు మెదడులో ఉంచుకోవాలో ఇక్కడ చర్చిద్దాం.

మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరూ ఫ్రెండ్స్ కాదు. ఒక్కసారి మీరు జాబ్ వదిలేసినట్టయితే వారు మిమ్మల్ని మర్చిపోతారు. అందుకే ఎవ్వరితోనూ డీప్ గా ఫ్రెండ్ షిప్ చేయరాదు.

చాలా విషయాల్లో నువ్వే కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. రోజువారి విషయాల్లో ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కార్పోరేట్ ప్రపంచం అందుకు సిద్ధంగా ఉంటుంది.

నీ మేనేజర్, నీ సీనియర్లు నిన్ను డామినేట్ చేయాలనే చూస్తారు. నీ కంటే సీనియర్లు, గొప్ప ప్రతిభావంతులని ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి అంత ప్రతిభ లేకపోయినా అలా ఫీల్ అవుతుంటారు.

చాలా చిన్న కారణం కూడా నీ టర్మినేషన్ కి కారణం కావచ్చు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.

నువ్వు ఎదగాలంటే, ఆఫీసు రాజకీయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి.

బ్రతకడం కోసం పనిచేయాలి. అలాగే ప్రమోషన్ కోసం రాజకీయం చేయాలి.

ఐతే ప్రతీ కార్పోరేట్ కంపెనీల్లో ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు. దాన్ని లీడ్ చేసే వాళ్ళని బట్టి కంపెనీ పనితీరు ఉంటుంది. అందుకే కార్పోరేట్ కంపెనీల్లో పనిచేసేటపుడు ఈ విషయాల్లని దృష్టిలో ఉంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news