గుడ్ న్యూస్: ఇకపై పెన్షనర్ల పీపీవో ఆర్డర్ మరెంత సులభం..!

-

మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ అయ్యారా? ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నారా..? మీకు పెన్షన్ పొందటానికి అవసరమైన పీపీవో ఆర్డర్ లేదా? మరి ఇక ఇప్పటి నుండి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఏ చింతా పడక్కర్లేదు. ఎంతో సులువుగా మీరు పీపీవో ఆర్డర్ ని పొందవచ్చు. ఇది నిజమండి. మీరు కూడా సులువుగా పొందాలంటే ఇలా చెయ్యండి. దీనితో క్షణాల్లో పీపీవో ఆర్డర్ మీరు పొందవచచు. వివరాల్లోకి వెళితే… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వారు లేదంటే ఇప్పటికే పెన్షన్ తీసుకునే వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ PPO కోసం ఆన్‌లైన్‌లోనే పొందొచ్చు.

డిజి లాకర్‌తో సులభం గానే లేటెస్ట్ పీపీవో పొందొచ్చు. ఇక్కడ భవిష్య అకౌంట్‌ను డిజి లాకర్ అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి అంతే. ఇలా పెన్షనర్లు పీపీఓ‌ను ఒక్క క్లిక్‌తోనే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పీపీవో తయారు అవుతుంది. ఇది ఉంటేనే ఉద్యోగులకు పెన్షన్ వస్తుంది. అంతే కాకుండా ప్రభుత్వం పెన్షన్ పెంచితే కూడా ఇది అవసరం పడుతుంది. లాక్ డౌన్ సమయం లో ఈ పీపీవో గురించి ఆందోళన చెందారు.

అయితే ఇకపై ఇపీపీవోలు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఆన్‌లైన్‌ లోనే పీపీవో పొందొచ్చు. సీనియర్ సిటిజన్స్ నుంచి పీపీఓకు సంబంధించి తరుచుగా పెన్షన్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. దీని మూలంగా వచ్చిన ఈ సర్వీసులు వల్ల చాలా బెనిఫిట్ కలిగిందని తెలిపారు. పీపీవో ఆర్డర్ చేతికి రాని వారు ఆన్‌లైన్ ‌లోనే పీపీవో డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల పెన్షన్ పొందడం లో ఇబ్బందులు పడలేదని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news