పుష్ప సినిమా విలన్ కష్టాలు.. ఈ సారి బాలీవుడ్ నటుడి పేరు..

-

పుష్ప సినిమాకి విలన్ కష్టాలు ఇంకా తీరలేదు. ఎప్పటికప్పుడు కొత్త పేరు వినిపిస్తున్నా, ఎవరూ ఫైనల్ కావట్లేదు. ఐతే ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న పుష్ప సినిమాకి మరికొద్ది రోజుల్లో విలన్ సెట్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సుకుమార్, విలన్ కోసం బాగా వెతుకుతున్నాడట. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు విలన్లు సెట్ అయ్యారు. ప్రధాన విలన్ మాత్రం ఎవరనేది ఇంకా తెలియలేదు. తాజా సమాచారం ప్రకారం విలన్ కోసం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ని అనుకుంటున్నట్లు సమాచారం.

ఈ మేరకు అధికారిక సమాచారం రానప్పటికీ, పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప సినిమా రూపొందుతుంది కాబట్టి, బాలీవుడ్ నటుడిని తీసుకుంటే ఉత్తరాది జనాలకి దగ్గరయ్యే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారట. మరి విలన్ ని ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపిస్తుంది. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ లో నిర్మితం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news