ఇలా చేస్తే నెలసరి సమయంలో సమస్యలు మాయం…!

-

నెలసరి సమయం లో ఎదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. నిజంగా అటువంటప్పుడు నరకంలాగ ఉంటుంది. అయితే ఆ సమస్యం లో ఏ సమస్య రాకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలని పాటించండి. ఇలా చేస్తే అప్పుడు ఏ ఇబ్బంది కలుగదు. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఆ చిట్కాల గురించి చూసేయండి. అధికంగా కడుపు నొప్పి నెలసరి సమయం లో వస్తూ ఉంటుంది.

నొప్పి కలగడానికి గల కారణం హార్మోన్ల అసమతుల్యత అని చెప్పవచ్చు. ఈ సమస్య నుండి బయట పడాలంటే మామూలు రోజుల్లో అన్నం తో ముద్ద నువ్వుల పొడి కొద్దిగా తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి బహిష్టు సమయంలో నొప్పి ఉండదు. ఇది ఇలా ఉంటె కొంత మందికి నెలసరి సమయం లో అధిక రక్తస్రావం జరగడం వల్ల రక్తహీనత సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్య కనుక ఉంటె ఐరన్ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకుంటే చాలు.

అలానే నెలసరి క్రమంగా రానట్టయితే… వారానికి రెండు సార్లైనా మెంతి కూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నెలసరి క్రమంగా వస్తుంది. అన్నం తక్కువగా తీసుకుని ఆకుకూరలను, కూరగాయలను ఎక్కువ మోతాదు లో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైనన్ని పోషకాలు అందుతాయి. కాబట్టి ఈ సులువైన మార్గాలని అనుసరించి ఈ సమస్యల నుండి బయట పడండి.

Read more RELATED
Recommended to you

Latest news