బ్యాంకులలోని లాకర్లలో సహజంగానే ఎవరైనా డబ్బు, నగలను దాచుకుంటుంటారు. కొందరు ముఖ్యమైన పత్రాలను, తాళాలను, ఇతర వస్తువులను కూడా దాచుకుంటారు. అయితే ఈ సంఘటన గురించి తెలిస్తే ఇకపై ఎవరూ బ్యాంకు లాకర్లలో నగదును, ముఖ్యమైన పత్రాలను దాచుకోరు. ఎందుకంటే.. బ్యాంకు లాకర్లో ఓ వ్యక్తి దాచుకున్న రూ.2.20 లక్షల నగదును చెద పురుగులు తినేశాయి మరి.
గుజరాత్‌లోని వడోదరకు చెందిన రెహనా కుతుబుద్దీన్ దెసర్వాల్ అనే వ్యక్తి అక్కడి బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఒక బ్రాంచ్‌లో లాకర్ నంబర్ 252లో రూ.2.20 లక్షలను దాచుకున్నాడు. అయితే తాజాగా అతను ఆ లాకర్‌ను ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు. కారణం.. లాకర్లో ఉన్న నగదు మొత్తాన్ని చెద పురుగులు తినేశాయి. దీంతో అతను లబోదిబోమంటున్నాడు.
જો તમે લોકરમાં રૂપીયા મૂક્યા હોય તો થઈ જજો સાવધાન
તમારા રૂપીયાને લાગી શકે છે ઉધઈ !
વડોદરામાં @bankofbaroda ની પ્રતાપનગર બ્રાંચમાં લોકરમાં મૂકેલા 2.20 લાખ રૂપીયાને ઉધઈ લાગી
તો શું હવે બેંક વળતર આપશે કે નહી ?@MyVadodara @VoiceBaroda #Gujarat #vadodadra #BREAKING #BreakingNews pic.twitter.com/u4yTNODyvT— Kamit solanki 🇮🇳 (@Kamit09) January 22, 2021
కాగా లాకర్ పట్ల నిర్లక్ష్యంగా వహించినందుకు, తన డబ్బులను చెద పరుగులు తిన్నందుకు గాను బ్యాంకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆ వ్యక్తి ఆ బ్యాంక్‌పై ఫిర్యాదు చేశాడు. అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం లాకర్లలో దాచిన నగదు లేదా వస్తువులు లేదా ఆభరణాలకు బ్యాంకులు బాధ్యత వహించవు. దొంగతనం జరిగినా బ్యాంకుకు సంబంధం ఉండదు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా ఇకపై మీరు లాకర్లో ఏవైనా దాచుకోవాలంటే ఈ విషయం కూడా ఒక్కసారి ఆలోచించండి.