నేటి కాలం లో ప్రేమ లో పడడం బ్రేకప్ అయిపోవడం చాలా కామన్ అయిపోయింది. బ్రేకప్ నుంచి చాలా మంది యువత బయటపడ లేక జీవితం లో ముందుకు వెళ్ల లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లవ్ ఫెయిల్యూర్ నుండి ఎలా బయట పడాలో అర్థం కాక ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. లవ్ ఫెయిల్యూర్ నుండి బయట పడాలంటే ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల కాస్త సులువు గానే మీరు దాని నుండి బయట పడవచ్చు. లవ్ ఫెయిల్యూర్ నుండి బయట పడాలంటే ఈ విధాలుగా ఫాలో అవ్వండి:
మీ గోల్ మీద ఆసక్తి చూపడం:
బ్రేకప్ బాధ లో పడి.. ఉన్న జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీరు మీ గోల్ పై ఆసక్తి చూపించడం ప్రారంభించండి. మీ కలలు పై దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇలా మీరు మీ గోల్ మీద దృష్టి పెట్టడం వల్ల బ్రేక్ అప్ బాధని మరిచిపోవడానికి వీలవుతుంది.
కొత్త పనులు ప్రారంభించడం:
లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆస్తమాను దిగులుగా ఉండటం కంటే మీ ప్యాషన్ ని మీరు డెవలప్ చేసుకోండి. ఉదాహరణకు మీకు గిటార్ ఇష్టమైతే గిటార్ క్లాసు లో జాయిన్ అవ్వడం, ఎక్కువ సమయం గిటార్ ను నేర్చుకోవడానికి కేటాయించడం… ఇలాంటివి చేస్తే ఇక బాధ నుంచి బయట పడవచ్చు.
దూర ప్రాంతాలకు వెళ్లడం:
ఇంట్లోనే ఒక మూల కూర్చుని బాధ పడిపోవడం కంటే కొత్త ప్రదేశాలను చూడడం ఆనందంగా మీ సమయాన్ని మీరు అనుకున్న చోట గడపడం చేస్తే ఈ బాధ నుంచి మీరు బయట పడవచ్చు. ఇలా మీకు నచ్చిన పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం లేదంటే ఇంట్లో పనులు చేసుకోవడం వగైరా వాటిని చేయండి. దీనితో మీరు లవ్ ఫెయిల్యూర్ నుండి బయట పడొచ్చు.