అది రైల్వే స్టేషనే. అన్ని రైల్వే స్టేషన్లలాగానే అక్కడా రైళ్లు ఆగుతాయి. ప్యాసెంజర్లు రైళ్లు ఎక్కుతారు. దిగుతారు. టీ అమ్మేవాడు టీ అమ్ముతాడు. ఇతర ఆహార పదార్థాలు అమ్మేవాడు వాటినీ అమ్ముకుంటాడు. కానీ.. ఒక్కసారి ప్లాట్ ఫాం 1, 2 కార్నర్ కు వెళ్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఎందుకంటే.. అక్కడ ఉండేది ప్యాసెంజర్లు కాదు. మరి.. ఎవరు అంటారా? నిరుద్యోగులు. అవును.. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగులు అక్కడ పరీక్షలు రాస్తూ.. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ కనిపిస్తారు. ఒక్క రోజు.. ప్రతి రోజు అక్కడ వందల మంది యువకులు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. మీరు పైన చూస్తున్న ఫోటో కూడా అదే. ఇంతకీ ఎక్కడ ఉంది ఆ స్టేషన్. రైల్వే స్టేషన్ లో ఉద్యోగాలకు ప్రివేర్ అవడం ఏంది. లింక్ లేదే అంటారా? అయితే.. మనం ఓసారి ఆ రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సిందే.
రోజుకు రెండు గంటలు ఆ రైల్వే స్టేషన్ కోచింగ్ సెంటర్ గా మారుతుంది. ఆ రైల్వే స్టేషన్ బీహార్ లోని ససారంలో ఉంది. ససారం రైల్వే స్టేషన్. పాట్నా సుపరింటెండెంట్ ఆఫ్ రైల్ పోలీసు చలువ వల్లనే వాళ్లు ఆ రైల్వే స్టేషన్ లో ప్రిపేర్ అవగలుగుతున్నారు. ఆయన పేరు జితేంద్ర మిశ్రా. మొత్తం 500 మందికి ఐడీ కార్డులు ఇచ్చి ఆస్టేషన్ లో ప్రిపేర్ అవడానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకు అలా అంటే.. ఆ యువకులంతా పేదవాళ్లు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవాళ్లు. కోచింగ్ తీసుకునే స్థోమత వాళ్ల దగ్గర లేదు. అందుకే.. అక్కడికి వచ్చే వాళ్లలో కొంతమంది సీనియర్లు కూడా ఉంటారు. వాళ్లు మిగితా వాళ్లకు వాళ్ల సబ్జెక్ట్ లో నేర్పిస్తారు. ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. మాక్ టెస్ట్ లు పెట్టిస్తారు. ఏ డౌట్ ఉన్నా అక్కడే క్లారిఫై చేసుకోవచ్చు. రాత్రి అయితే.. అక్కడే ఉన్న లైట్ల కింద ఉండి చదువుకోవచ్చు.
ప్రతి రోజు దాదాపు 1200 మంది యువకులు దాకా ఆ స్టేషన్ కు వస్తారట. చాలామంది యువకులు మావోయిస్టుల ప్రభావం ఉన్న రోహతాస్ ప్రాంతానికి చెందిన వారేనట. అవన్నీ అడవుల్లో ఉంటాయి. అక్కడ కరెంట్ ఉండదు. ఎటువంటి ఫెసిలిటీలు ఉండవు అక్కడ. అటువంటి వాళ్లు రైల్వే స్టేషన్ కు వచ్చి… లైట్ల కింద చదువుకొని.. ఎటువంటి సందేహాలు ఉన్నా అక్కడే తీర్చుకొని వెళ్తారు. ఇక్కడ పలు సబ్జెక్టుల్లో టెస్టులు పెట్టడంతో పాటు ఇంటర్వ్యూను ఎలా ఫేస్ చేయాలో కూడా నేర్పిస్తారు. అందుకే.. చదువు పూర్తి కాగానే.. ఆర్థిక ఇబ్బందులు ఉన్న చాలా మంది యువకులు ఈ రైల్వే స్టేషన్ కు క్యూ కడతారు. ఎన్నో ఆశలతో.. తమ కలలను నిజం చేసుకోవడానికి ఆ రైల్వే స్టేషన్ కు వెళ్తారు. అలా వెళ్లి అక్కడ ప్రిపేర్ అయిన వాళ్లలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయట. ఉద్యోగాలు వచ్చిన వాళ్లు మిగితావాళ్లకు ఎలా ప్రిపేర్ అవ్వాలో నేర్పిస్తారన్నమాట. అది ఆ రైల్వే స్టేషన్ కమ్ కోచింగ్ సెంటర్ స్టోరీ.