మెగా హీరో వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమా అంతరిక్షం. ఘాజి తర్వాత సంకల్ప్ చేసిన మరో ప్రయత్నమే ఈ అంతరిక్షం. తెలుగు పరిశ్రమలో మొదటి స్పేస్ కాన్సెప్ట్ మూవీగా ఈ మూవీ భారీ క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సినిమా కాన్సెప్ట్, డైరక్షన్ అంతా బాగున్నా సినిమాలో ఇంకా ఏదో మిస్సైంది అన్న ఫీలింగ్ ఉంది.
మెగా హీరోగా వరుణ్ తేజ్ ఇలాంటి మూవీ ఒప్పుకున్నందుకు ఫ్యాన్స్ సంతోషపడుతున్నా సినిమా ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. ఇక ఈ సినిమా మొదటిరోజు కలక్షన్స్ విషయానికొస్తే వరుణ్ తేజ్ కెరియర్ లో లీస్ట్ ఓపెనింగ్ డే కలక్షన్స్ అని చెప్పొచ్చు. కేవలం తొలిరోజు 1.20 కోట్లు మాత్రమే అంతరిక్షం వసూళు చేసింది. 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన అంతరిక్షం మొదటి రోజు దర్శక నిర్మాతలకు పెద్ద షాక్ ఇచ్చింది.
క్రిష్, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా ప్రయోగమాత్మక సినిమానే అయినా తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఇంకాస్త ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.