మదనపల్లి వ్యవహారంలో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జంట హత్యల కేసులో నిందితురాలు అయిన పద్మజ వ్యవహారం పోలీసులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఇక పద్మజ భర్త కూతుళ్ళు పోయారు అని ఆవేదన వ్యక్తం చేస్తుంటే పద్మజ మాత్రం పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తుంది. మదనపల్లె జైలులో పద్మజ పరిస్థితి మొదటికి వచ్చింది. రాత్రంతా శివ శివ అంటూ కేకలు వేసింది.
తోటి ఖైదీలంతా హడలిపోయి జాగారం చేసారు. జైలులో రెండు మహిళా బ్యారెక్లో 15 మంది ఖైదీలకు పద్మజ చుక్కలు చూపిస్తుంది. జైలు అధికారులు కూడా ఆమె విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేనే శివుడిని నన్నే లోపల వేస్తారా అంటూ మదనపల్లి సబ్ జైలు లో ఉన్న పద్మజ అరుపులు కేకలు వేయడం గమనార్హం. ఆమెను విచారించాలని భావించినా సరే పోలీసులు కూడా ముందుకు రావడం లేదు.
ఇద్దరు కుమార్తెల హత్య కేసులో సబ్ జైలు లో పద్మజ, పురుషోత్తమ నాయుడు ఇంకా సాధారణ స్థితికి రాలేదు అని అధికారులు చెప్తున్నారు. పద్మజ యధావిధిగా జైలులో అరుపులు కేకలతో హడలెత్తిస్తున్నదని… తండ్రి పురుషోత్తమ నాయుడు అప్పుడప్పుడు కుమార్తెలను తలుచుకుంటూ ఏడుస్తున్నారు అని, విశాఖపట్నం మానసిక వైద్యశాల తరలింపుకు ఆలస్యం అవుతుందని అధికారులు వివరించారు. ఎస్కార్ట్ అధికారులు కూడా ముందుకు రావడం లేదని అంటున్నారు.