రేషన్ వాహనాలు ఎక్కిన నిమ్మగడ్డ… ఎందుకు…?

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ మధ్య కాస్త సంచలనం అయ్యారు. ఆయన ఏది మాట్లాడినా సరే కాస్త సంచలనంగానే ఉంది. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. తాజాగా రేషన్ డోర్ డెలివరీ మీద ఆయన దృష్టి పెట్టారు. రేషన్ పంపిణీ వాహనాలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు.

విజయవాడలో ఆయన ఈ వాహనాలను పరిశీలించారు. పంపిణీ ఏరకంగా జరుగుతుందో పౌరసరఫరాల‌శాఖ కమీషనర్ కోన శశిధర్ వివరించారు. పంపిణి వాహనం లో ఎక్కి పరిశీలించిన ఎస్ఈసీ… అన్ని సదుపాయాలను గమనించారు. వాహనాలలో ఉన్న సదుపాయాలు, వినియోగం పరిశీలించారు. వాహనం డ్రైవర్ కేబిన్ లో కూర్చొని వివరాలు అధికారులును వివరాలు అడిగి ఆయన తెలుసుకున్నారు.

వాహనం లోని కాటా, వాహనం పైన ఉన్న ముఖ్యమంత్రి జగన్ చిత్రపటాన్ని సైతం పరిశీలించారు. వాహనం వెనుక డోర్ పై ఉన్న నవరత్నాలు, మాజీ సీఎం వై ఎస్ ఆర్, వై ఎస్ జగన్ చిత్రపటాల్ని సైతం పరిశీలించారు. ఇక ఇదిలా ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాచ్ యాప్ ని ప్రవేశ పెట్టారు. దీనిపై అధికార వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక ఎన్నికల నిర్వహణ లో ఫిర్యాదులు స్వీకరణ కు ఈ వాచ్ యాప్ ను ప్రవేశ పెట్టారు. 12 గంటలకు కృష్ణ జిల్లా కలెక్టర్, పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news