ఇలా ల్యాప్ టాప్ ని చార్జింగ్‌లో పెట్టొద్దు..!

-

ఎలక్ట్రానిక్ డివైస్‌లకి చార్జింగ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ల్యాప్ టాప్ చార్జింగ్ పెట్టేటప్పుడు వాటిని అలా మంచం పై ఉంచడం మంచి పధ్ధతి కాదు. అలానే మంచం పై చార్జింగ్ పెడితే బ్యాటరీ జీవిత కాలం కూడా దీని కారణంగా తగ్గిపోతుంది. అలానే ఎక్కువసేపు ఆలా మంచం పైన, సోఫా పైన వదిలేయకండి. దీని వలన ఎన్నో నష్టాలూ సంభవించవచ్చు. మనం ల్యాప్ టాప్‌ని బెడ్ మీద కానీ, సోఫా మీద కానీ పెట్టి చార్జింగ్ పెట్టినప్పుడు దానిలో నుంచి వేడి బయటకు ఎక్కువగా వెళ్లదు.

దానితో ల్యాప్ టాప్ పార్టులు కూడా పాడైపోయే ఛాన్స్ ఉంది. తాజాగా ఇంగ్లండ్ ‌లోని బర్మింగ్‌హాం లో ఒక ఘటన చోటు చేసుకుంది. దీనిని చూశారంటే షాక్ అవుతారు. ల్యాప్ టాప్ కారణంగా ఏకంగా ఇల్లే కాలి పోయింది. ల్యాప్ టాప్ చార్జింగ్ పెట్టేసి అలాగే మంచం మీద వదిలేస్తే… ఓవర్ హీట్ అయి ఫ్లాట్ పూర్తిగా కాలి పోయింది.

గదులు, గోడలు, సీలింగ్‌కు తీవ్ర నష్టం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎలక్ట్రానిక్ డివైస్‌లకి చార్జింగ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఎన్నో ముప్పులు సంభవించే అవకాశం ఉంది. ఫోన్స్ నుండి ల్యాప్ టాప్స్ వరకు చార్జింగ్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదంటే ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news