చిత్తూరు జిల్లా ఏకాగ్రీవాలకు సంబంధించి రాజంపేట వైసీపీ ఎంపి మిధున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నామినేషన్లు వేస్తే చాలా గెలిచినట్లుగా టిడిపి భావిస్తోందన్న ఆయన తిరుపతి కి వచ్చి నిమ్మగడ్డ ఏకగ్రీవాలు అయితే చర్యలు తీసుకుంటానని బెదిరించినా ప్రజలు మాత్రం పంచాయతీలను ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని అన్నారు. ప్రజలు మా పార్టీ వైపు ఉంటే ఎన్నికల కమిషన్ ఏమీ చేస్తుంది..చంద్రబాబు ఏమీ చేస్తాడు అని ఆయన ప్రశ్నించారు.
ఇక మీద ఇంకా ఏకగ్రీవాలు జరుగుతాయి …2,3,4 దశలలో కూడా ఎకగ్రీవాలు జరుగుతునే ఉంటాయి…ఇంకో పది సార్లు ఎన్నికలు పెట్టినా ఏకగ్రీవాలు జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. అతే కాక పోటి అభ్యర్థులు దొరకని పార్టీలు మా గురించి మాట్లాడటామా అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఏకగ్రీవాలు జరుగుతాయి తప్ప… ఆగేది ఉండదని గుర్తు పెట్టకోండని ఆయన చెప్పుకొచ్చారు. మరి దీనికి సంబంధించి నిమ్మగడ్డ ఏమని స్పందిస్తారో వేచి చూడాలి.