ఏదో ఒక పని చేయడం, దానికి సంబంధించిన ఫొటో లేదా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. వైరల్ అవ్వాలని చెప్పి కొందరు ప్రాణాలకు తెగించి ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఓ జంట కూడా కొండ పై నుంచి అంచుకు వేలాడుతూ ఫొటో దిగారు.
ఓ జంట కొండపై చివర్లో వేలాడుతూ ఫొటో దిగారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆ ఫొటో వైరల్ అవుతోంది. అయితే ఆ ఫొటో నిజం కాదని, ఫొటోషాప్ చేశారని కొందరు కామెంట్లు చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం.. పోయే కాలం వచ్చింది, అలా ఫొటోలు దిగకపోతే ఏమిటి ? అని కామెంట్లు పెట్టారు.
My Responsibilities। https://t.co/XPrcE3HXcI
— पंडित (@konoha_wala) February 2, 2021
Lack of photo shopping skills. https://t.co/PstPaAKd5y
— Arun Bothra (@arunbothra) February 3, 2021
అయితే నిజానికి అది ఫొటోగ్రఫీ ట్రిక్ అని.. ఇంకో యాంగిల్ లో చూస్తే అసలు వారు కొండ చివర్లో ఉన్నప్పటికీ అది అంత ప్రమాదకరం కాదని తెలుస్తుంది. ఎందుకంటే టర్కీలోని మెర్సిన్ అనే ప్రాంతంలో ఉన్న గులెక్ క్యాజిల్‌లో ఓ కొండ కింది భాగంలో కొద్దిగా స్థలం ఉంటుంది. ఈ క్రమంలో కొండ మీద ఉన్నవారిని ఒక ప్రత్యేకమైన యాంగిల్లో ఫొటో తీస్తే వారు నిజంగానే అక్కడ వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ వారు వేలాడే కింది భాగంలో లోయ ఉండదు. అక్కడ కొంత స్థలం ఉంటుంది. అందువల్ల ఈ జంట దిగిన ఫొటో కూడా అక్కడిదేనని ఇంకొందరు అంటున్నారు. అయితే ఇలాంటి సాహసాలను ఎవరూ ప్రయత్నించకూడదు. ఎందుకంటే అలాంటి చోట్ల చిన్న స్టెప్ జారినా ప్రాణాలు పాతాళంలో కలుస్తాయి. కనుక ఇలాంటి ప్రయత్నాలు అస్సలు చేయరాదు.