దగ్గుబాటి రానా, క్రేజీ హీరోయిన్ త్రిషాల లవ్ ట్రాక్ గురించి అందరికి తెలిసిందే. ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకానొకదశలో రానా, త్రిషా పెళ్లంటూ వార్తలు కూడా వచ్చాయి. కాని ఏమైందో ఏమో త్రిషా చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధమైంది. అఫ్కోర్స్ ఎంగేజ్మెంట్ అయ్యాక ఆ పెళ్లి పెటాకులయ్యిందనుకోండి. రానాతో త్రిష రిలేషన్ ఏంటని అందరు తెలుసుకోవాలని అనుకుంటారు.
ఇదే విషయాన్ని డైరెక్ట్ గా అడిగేశాడు కరణ్ జోహార్. కాఫీ విత్ కరణ్ సినిమాలో త్రిషని ఎందుకు పెళ్లి చేసుకోలేదని డైరెక్ట్ ఎటాక్ చేశాడు కరణ్ జోహార్. అయితే దాన్ని కవర్ చేసే ప్రయత్నంలో తను నేను క్లోజ్ గా ఉండటం వల్ల ఈ వార్తలు వచ్చాయని చెప్పుకొచ్చాడు రానా. మొత్తానికి ఇలాంటి షోలకు వెళ్లడం వల్ల తాము చేసిన చిలిపి పనుల గురించి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది.
బాహుబలి టీం తో కాఫీ విత్ కరణ్ షో చేసిన కరణ్ జోహార్ ఇదే ఎపిసోడ్ లో రాజమౌళి, ప్రభాస్ లను అదేవిధంగా ప్రశ్నలతో ఎటాక్ చేశాడు. ప్రభాస్, అనుష్కల మ్యాటర్ గురించి అడుగగా మీలాంటి వారే అలాంటి వార్తలు రాస్తున్నారని ప్రభాస్ చెప్ప్పడం విశేషం.