సైబరాబాద్ లో ద్విచక్ర వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ మొదటి సారి దొరికితే మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయనున్నట్లు చెబుతున్నారు. అలాగే రెండో సారి హెల్మెట్ లేకుండా దొరికితే ఇక శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో ఎంతో మంది వాహనదారులు అధికారులు ఎంత సూచించినప్పటికీ రోడ్డు నిబంధనలు పాటించకుండా చివరికి ప్రమాదాలకు గురి అవుతూ ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. హెల్మెట్ పెట్టుకోవాలని ఎంతలా సూచించి అవగాహన కల్పించినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా ఉన్నందున రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే అన్ని కమిషనరేట్ ల పరిధిలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందని అంటున్నారు.