ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ముందుగా భావించామని న్యాయ స్థానాల్లో కేసుల కారణంగా ఈ ఎన్నికలకు కొన్ని అవాంతరాలు ఉన్నాయి కాబట్టి అవరోధాలు తొలగిపోయిన అనంతరం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ర్చి 2నుంచి పురపాలక ఎన్నికల ప్రక్రియ మొదలు అవుతుందని, పట్టణ ఓటర్లు కూడా పెద్దఎత్తున ఓటింగులో పాల్గొనాలని అయన పిలుపునిచ్చారు.
వీలైనంత ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు,సదుపాయాలు కల్పిస్తామని ఆయన అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో ఒత్తిళ్ల వల్ల గతంలో నామినేషన్ల ఉపసంహరించుకున్న వారి విజ్ణప్తులపై చర్చిస్తామని ఆయన అన్నారు. పురపాలికల్లో నామినేషన్లు వేయలేక పోయిన వారు రుజువులతో సహా ఫిర్యాదు చేస్తే నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తామని అయన అన్నారు. అందరి హక్కులను కాపాడే బాధ్యత ఎస్ఈసీపై ఉందని పేర్కొన్నారు.