శుభవార్త: 8వ విడత కింద రైతులకి మరో రూ.2 వేలు…!

-

కేంద్రం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 8వ విడత కింద మరో రూ.2 వేలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ తీసుకు వచ్చిన సంగతి తెలిసినదే. ఇప్పటికే ఈ పధకం కింద రైతులకి డబ్బులు అందుతున్నాయి. అర్హులైన రైతులకి ప్రతి ఏడాది రూ.6,000 లభిస్తాయి.

రైతులకు సంవత్సరానికి మూడు విడతల్లో రూ.2 వేలు అందుతాయి అన్న సంగతి కూడా తెలిసినదే. ఇప్పటి దాకా కేంద్రం రైతులకి 7 విడతల డబ్బులను అందించగా…ఇప్పుడు రైతులకి 8వ విడత డబ్బులు అందించేందుకు రెడీ అవుతోంది. ఈ డబ్బులు మార్చి నెల లో రైతుల ఖాతా లోకి చేరవచ్చు. ఇది ఇలా ఉండగా చాల మంది అనర్హులని కూడా తొలగించినట్టు తెలిసినదే.

బెనిఫీసియరీ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. లిస్ట్‌లో పేరు లేకపోతే డబ్బులు రావు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీ పేరు ఉందొ లేదో చూడండి. అలానే ఇంకా మీరు ఈ పధకం లో చేరకపోయి ఉంటె మీరు ఇందులో చేరవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్, పొలం పాస్‌బుక్, ఆధార్ కార్డు ఉండాలి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news