కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అనుకుంటున్న సమయంలో మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండడం ఆందోళనని రేకెత్తిస్తుంది. మహారాష్ట్ర నుండి ఇతర కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వెళ్లేవారు ఖచ్చితంగా కరోనా నెగెటివ్ రిపోర్ట్ తీసుకుని రావాల్సిందే అని నియమం పెట్టాయి. మాహారాష్ట్ర ప్రభుత్వం కూడా నాగ్ పూర్, అకోలా వంటి కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూలు విధించాలని నిర్ణయం తీసుకున్నాయి.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పక్కన రాష్ట్రాలు కొంత భయాందోళనలకి గురవుతున్నాయి. తెలంగాణలోనూ ఈ భయం ఉంది. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు దిగులు చెందుతున్నారు. తాజాగా తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, కరోనా గురించి అప్రమత్తంగా ఉండాలని, మరీ అజాగ్రత్తగా ఉండకూడదని, ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని, నైట్ కర్ఫ్యూల గురించి ఆలోచించట్లేదని తెలిపారు.