రాహుల్ గాంధీ రూటు మార్చారా..సౌత్ ప్రచారంలో కొత్త ఒరవడి అందుకేనా

-

ఇన్నీ రోజులు ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అన్నట్లుగా ఉంది రాహుల్‌ గాంధీ తీరు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణాదిలో పర్యటిస్తున్న రాహుల్‌ గాంధీ వినూత్న విన్యాసాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రజల్లో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడూ ఓపెన్ మైండ్ తో గుంభనంగా ఉండే యువనేత..ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో స్టైల్ మార్చాడంతో రాహుల్ గాంధీ పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

రాహుల్‌ గాంధీ బిజీ పర్సన్‌.. ఎప్పుడూ చుట్టూ నేతలు.. పార్టీ కార్యక్రమాలు..మీటింగ్‌లు పెద్దగా సమయం ఉండదు..కానీ దక్షిణాధి రాష్ట్రాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు రాహుల్‌ గాంధీ. ప్రజలతో మమేకమవుతున్నారు. ఎక్కడికెళ్లినా ప్రత్యేకత చాటుకుంటున్నారు. ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఎన్నికల స్టంట్స్ చేస్తూ.. అసలు సిసలు రాజకీయనాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రచారంలో ఫీట్లు చేయడమే కాదు యువతను ఆకట్టుకునేందుకు మాటల్లో పదును పెంచారు రాహుల్‌ గాంధీ. అధికార పార్టీని టార్గెట్‌ చేస్తూనే తామేమి చేయబోతున్నామో వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో మూడు రోజులపాటు పర్యటిస్తున్నారు రాహుల్‌. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలతో బిజీగా గడుపుతున్నారు. మోదీ ప్రభుత్వం తమిళ సంస్కృతిని గౌరవించడంలేదంటూ నిప్పులు చెరిగారు. తమిళనాడు సీఎం కూడా మోదీ చెప్పినట్టే చేస్తున్నారని ఆరోపించారు. కన్యాకుమారిలో రోడ్‌షో నిర్వహించిన రాహుల్‌ మోడీ, పళనిస్వామి పై విమర్శలు గుప్పించారు. తమిళ సంస్కృతిని ఆర్ఎస్ఎస్ అవమానిస్తే..మోడీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వన్‌ నేషన్‌, వన్‌ కల్చర్‌ అన్నారు. మరి తమిళం భారతీయ భాష కాదా అంటూ నిలదీశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్ధులను విమర్శించడం కాదు.. ఓటర్లను ఆకట్టుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతన్నారు రాహుల్‌ గాంధీ. ఒక వైపు అధికార పార్టీని విమర్శిస్తూనే తన బలాన్ని బహిర్గతం చేస్తున్నారు. ప్రేమ, అహింస ఆయుధాలుగా తాను మోడీని ఓడిస్తానన్నారు రాహుల్‌ గాంధీ. తమిళనాడు ప్రచారంలో భాగంగా.. తిరునల్వేళిలో మేదావులతో సమావేశమయ్యారు. ప్రజల మద్దతుతో అధికారాన్ని చేపట్టి, తనకున్న ఆలోచనలు అమలు చేస్తామన్నారు.యువతను ఆకట్టుకునేందుకు తన మాటల్లో పదునుపెంచారు.

ప్రచారంలో భాగంగా సామాన్యులతో కలిసిపోతున్నారు రాహుల్‌ గాంధీ. ఓ వృద్ధాశ్రమం కోసం ప్రత్యేకంగా బిర్యానీ చేయించారు. తానే స్వయంగా బిర్యానీ వండారు. వారితో కలిసి అక్కడే కూర్చుని భోజనం చేశారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న దీక్ష సమయంలోనూ వినూత్నంగా ఆలోచించారు రాహుల్‌ గాంధీ. రైతులు ఇచ్చిన ట్రాక్టర్‌ ర్యాలీకి మద్దుతుగా తానే స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ నిరసన తెలిపారు.

మొత్తానికి రాహుల్ సౌత్‌ టూర్‌ ఆసక్తిగా సాగుతోంది. గతానికి భిన్నంగా ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు రాహుల్ గాంధీ. పాలకుడిగా కాకుండా… నాయకుడిలా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news