శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

-

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని అంటేనే నీతి, ధర్మం, న్యాయానికి కట్టుబడి ఉండేవాడు. శనిదేవుడు నుంచి అశుభాలను ఎదుర్కొంటున్నవారు భక్తితో ఆయన్ని కొలిచి ధర్మాన్ని పాటించేవారికి ఆయన ఎప్పుడూ కీడు చేయాడు. ఆయన చల్లని దృష్టితో వారితో కాపాడతాడు.

శనిత్రయోదశి ప్రాముఖ్యత

శనిత్రయోదశి అనగా శనివారం రోజు వచ్చే త్రయోదశి తిధిని శని త్రయోదశి అంటారు. ఆ రోజు శనిదేవుడిని నల్ల నువ్వులు, నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తారు. ఆ విధంగా చేస్తే మంచిదని మన పూర్వీకులు చెబుతుంటారు. ఆ అభిషేకాలు ఏంటి? ఎలా చేయాలి? చూద్దాం!

ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కోర్టు కేసులు, శత్రువుల పీడ నుంచి విముక్తి కలగాలంటే శని దేవుడికి మొక్కి నియమాలు పాటించాలి. శనీశ్వరుడిని ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు బిక్షగాళ్లకు, పేదవారికి మన శక్తి కొలది ధన, వస్త్ర, వస్తు, ఆహార రూపంలో దానధర్మాలు విశాల హృదయంతో చేస్తే మంచి శుభాలు కలుగుతాయి.

నల్లటి వస్త్రం రెండు మీటర్ల పొడవు, పూజ చేసిన తర్వాత ఆ వస్త్రాన్ని దానం చేయాలి. అది వారు ఉపయోగించునేలా ఉండాలి. దానం పశుపక్షాదులకు చేయాలి, ఉన్నవారికి చేస్తే ఆ ఫలితం దక్కదు.

త్రయోదశి వ్రతం

శనిదేవుని తల్లిదండ్రులు సూర్యభగవానుడు, ఛాయాదేవికి పుట్టిన కుమారుడు. ఆయన సోదరుడు యముడు, సోదరి యమున. శనికి ఉన్న మరో పేరు పింగళ, కోణస్త, శౌరి, బబ్రు, మంద, సూర్యపుత్ర. ఏ త్రయోదశి అయితే శని గ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోదించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు.
ఆరోజు శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మనం కోరుకున్న కోరికలను తీరుస్తాడు. దీనికి పాటించాల్సిన నియ మాలు.

 

  • ఉదయం నువ్వుల నూనేతో తలకు మర్దన చేసుకుని స్నానం చేయాలి
  •  మద్యం, మాంసం ఆ రోజు ముట్టరాదు.
  •  స్వయంగా శివార్చన చేయాలి.

శనిగ్రహ స్థానదోషాల వల్ల బాధింపబడేవారు

నీలాంజన సమబాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం
స్తోత్రాన్ని విలైనన్నిసార్లు పఠించాలి.

  • ఆ రోజు మౌనంగా ఉంటూ దైవచింతన ఉండాలి.
  • ఎవరితో వాదన చేయరాదు.
  • ఆరోజు ఆకలితో ఉన్న పశుపక్షాదులకు భోజనం పెట్టాలి.
  • భాగస్వామితో సఖ్యతగా ఉండాలి.

ఈ నియమాలు పాటించేవారికి శనిదేవుని కృప కచ్చితంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులను ఉన్నత స్థానంలో నిలబెడతాడు.

Read more RELATED
Recommended to you

Latest news