ఖైదీలు నడుపుతున్న కేఫ్‌ చూశారా?

-

సాధారణంగా కేఫ్‌లలో పోటీ దృష్ట్యా ఆకర్షించడానికి సందర్శకులకు నోరూరించే పదార్థాలనో లేదా అందమైన అమ్మాయిలను వెయిటర్‌గా పెట్టుకుంటారు. కానీ, నేను మీకు ఇప్పుడు చెప్పబోయే కేఫ్‌లో ఖైదీలే ప్రధాన ఆకర్షణండి. నిజం దానికి మనం ఓసారి సిమ్లా వెళ్లాల్సిందే.


చల్లని వాతావరణం, వేడివేడి కాఫీని ఆస్వాదిస్తూ మంచి పుస్తకాలను చదవడం చాలా ప్రత్యేకమే. అలాంటి ఓ ప్రదేశం గురించి నేను మీకు చెప్పబోతున్నా. ఇక్కడ పనిచేసేవారు కూడా సాధారణ వ్యక్తులు కాదు. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు.మీరూ ప్రతక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే తప్పక మీరు షిమ్లా వెళ్లాల్సిందే.

ఈ హోటల్లో ప్రత్యేకం పిజ్జా, కుకీ, శాండ్‌విచ్, ఇలా రకరకాల ఆహారాలను ఇక్కడ అందిస్తారు. అంతేకాదు ఈ కేఫ్‌కు వచ్చే సందర్శకులకు ఉచిత వైఫై సదుపాయం కూడా కల్పించారు. వారికోసం ప్రత్యేక పుస్తకాలను కూడా అందుబాటులో పెట్టారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రచయిత పుస్తకాలు కూడా ఇక్కడ చూడవచ్చు.

ఈ కేఫ్‌ పేరు బుక్‌ కే ఫ్‌. షిమ్లాలో ఇదో ప్రత్యేకమైన కేఫ్‌. కాఫీతో పాటు రుచికరమైన డ్రింక్‌లు, చుట్టూ అద్భుతమైన కొండలు, పర్వతాలతో చూడ మచ్చటైన ప్రదేశం ఇది. ఖైదీల పునరావాసం కోసం పనిచేస్తోన్న ఈ కేఫ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిధులు సమకూరుస్తోంది. ఈ కేఫ్‌లో మొత్తం 40 మందిని బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపెన్‌ ఉంటుంది. జైచంద్, యోగ్‌రాజ్, రామ్‌లాల్, రాజ్‌కుమార్‌ అనే ఖైదీలు ఈ కేఫ్‌లో పనిచేసేందుకు అధికారికంగా శిక్షణ తీసుకున్నారు. దానివల్ల కస్టమర్లకు సరైన విధంగా సేవలు అందించగలుగుతున్నారు. తమ కేరక్టర్‌ను నిరూపించుకోవడానికి ఇదే సరైన అవకాశం అనుకున్నారు. వీరు స్వతంత్రంగా నడుపుతున్న ఈ హోటల్‌ వల్ల ప్రపంచంతో మేము మమేకమైపోతున్నాం అని వీరు అంటున్నారు. వచ్చే సందర్శకులు కూడా వీరి మంచిచెడులపై ఆరాతీయడానికే ఆసక్తి చూపుతారట.

Read more RELATED
Recommended to you

Latest news