ప్రకాశం రాజకీయాల్లో వేలు పెట్టి మంత్రి వెల్లంపల్లి చేయి కాల్చుకున్నారా

-

ప్రకాశం జిల్లా రాజకీయాలు వివాదాలు ఎప్పుడు రసవత్తరంగా ఉంటాయి. ఇక ఎన్నికల సమయంలో అయితే వేరే చెప్పాల్సిన పని లేదు. మున్సిపల్‌ ఎన్నికల వేళ మంత్రి వెల్లంపల్లి వ్యవహరించిన తీరు మంత్రి,ఎమ్మెల్యే మధ్య వివాదానికి కరణమయింది. మార్కాపురం మున్సిపల్ చైర్మన్ వ్యవహరంలో మంత్రి వెల్లంపల్లి వ్యవహరించిన తీరు కొత్త వివాదానికి కారణమయింది. మంత్రి కనీసం ఆ జిల్లాకి కూడా ఇంచార్జ్ కాకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి జోక్యం ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో ఈ ఘటన హాట్‌ టాపిక్‌గా మారింది.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత. కుందురు నాగార్జునరెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే. ఇద్దరూ వేర్వేరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతిధులు. వీరి మధ్య మార్కాపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి గ్యాప్‌ తీసుకొచ్చినట్టు సమాచారం. అంతేకాదు ప్రకాశం జిల్లా వైసీపీలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది వీళ్ల రగడ. చైర్మన్‌గా మంత్రి సూచించిన వ్యక్తికి ససేమిరా అన్నారట ఎమ్మెల్యే. పైగా నా నియోజవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని ఆయన నిలదీశారని ప్రచారం జరుగుతోంది.

 

మార్కాపురం మున్సిపాలిటీకి గత ఏడాది నామినేషన్లు వేసిన సమయంలో ఛైర్మన్‌ పదవి కోసం వైసీపీలో ఇద్దరు లీడర్లు పోటీపడ్డారు. పార్టీ నేత బాలమురళీకృష్ణతోపాటు డాక్టర్‌ కనకదుర్గ ఆ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నించారు. స్థానిక ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఇద్దరికి సయోధ్య చేసి.. చెరో రెండున్నరేళ్లు పని చేసేలా ఒప్పందం కుదిర్చారట. కరోనా కారణంగా నిలిచిన ఎన్నికలు మళ్లీ మొదలు కావడంతో ఛైర్మన్ పదవికి కొత్తగా కాంపిటిషన్‌ ఎక్కువైంది. గతంలో పోటీలో ఉన్న ఇద్దరితోపాటు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సిఫారసుతో ఆయన సామాజికవర్గానికి చెందిన పెరుమాళ్ల కాశీరావు అనే మరో నేత రేస్‌లోకి వచ్చారట.

మంత్రి వెల్లంపల్లి దగ్గర పనిచేస్తున్న ఓ అధికారికి కాశీరావు బంధువని లోకల్‌గా టాక్ నడుస్తోంది. అందుకే మంత్రి నుంచి గట్టి రికమండేషన్‌ వచ్చిందట. దాంతో తానే మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్ అని కూడా పెరుమాళ్ల ప్రచారం చేసుకున్నారట. ఇది రుచించలేదో.. లేక తన నియోజకవర్గంలో మంత్రి జోక్యం ఏంటని అనుకున్నారో కానీ.. లోకల్‌ ఎమ్మెల్యే నాగార్జున్‌రెడ్డి కస్సుబుస్సులాడారట. ఎక్కడో విజయవాడలో ఉన్న మంత్రికి మార్కాపురం రాజకీయాలు ఎందుకని ఆశావహులు కూడా నిలదీసినట్టు సమాచారం. దాంతో వెల్లంపల్లి దగ్గర నుంచి ప్రతిపాదనను పక్కన పెట్టేశారట ఎమ్మెల్యే.

పరిస్థితిని అర్ధం చేసుకున్న కాశీరావు కూడా మూడు వార్డుల్లో వేసిన నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారట. ఇంత వరకు బాగానే ఉన్నా.. మున్సిపల్‌ ఛైర్మన్‌ అంశం ఎమ్మెల్యే, మంత్రి మధ్య దూరం పెంచిందట. అధికారపార్టీలోనూ దీనిపై రకరకాలుగా చెప్పుకొంటున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news