హోలీ నాటికి కేంద్రం డీఏ, డీఆర్ ని ప్రకటిస్తుందా..?

-

కేంద్ర ప్రభుత్వం ఈ హోలీ నాటికి గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైకింగ్ డియర్ నెస్ అలవెన్స్ రానున్నట్టు తెలుస్తోంది. డిఏ పెంపు తో పాటు డీఆర్ ని కూడా కేంద్రం పునరుద్ధరించవచ్చు. ఇలా చేస్తే 48 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ మరియు 65 లక్షల పెన్షనర్స్ కి బెనిఫిట్ కలుగుతుంది.

money
money

డీఏ మరియు డిఆర్ జనవరి కల్లా వచ్చేస్తుందని ముందు అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా అది వీలు అవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ హోలీకి ఇవ్వచ్చు అని తెలుస్తోంది. ప్రభుత్వం 4 శాతం దీనిని పెంచింది. దీనితో జీతం కూడా పెరుగుతుంది.

యూనియన్ క్యాబినెట్ మార్చి 2020 లో వీటిని పెంచడానికి ఒప్పుకుంది. 17 శాతం ఇంతకు ముందు ఉండేది. అయితే అది ఇప్పుడు 21 శాతానికి పెరగనుంది. అయితే అఫీషియల్ గా ఎటువంటి సమాచారం ఇంకా రాలేదు.

ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు 17 నుంచి 21 శాతానికి పెంచిన విషయాన్ని చెప్పారు. యంగ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) పర్సనల్ మరియు సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), అందరికీ కూడా ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది అని జనవరి ఒకటిన యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news