ప్లీజ్… మోడీ సభకు ఎవ్వరు వెళ్లొద్దు.. చంద్రబాబు..

-

ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 6న ఏపీ కి రానున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వినూత్నంగా అధికారులను, సామాన్య ప్రజలను…ప్లీజ్ ఎవ్వరూ మోడీ సభకు వెళ్లొద్దు అంటు వేడుకుంటున్నారు. రాష్ట్ర విభజన గాయంపై కారం పూయడానికి వస్తున్న ప్రధాని మోడీ సభకు ఎవరూ వెళ్లొద్దని చంద్రబాబు ప్రజలను కోరారు. ఆయన పర్యటనకు గైర్హాజరు కావడమే తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లని ఆయన వివరించారు. ప్రధాని సభకు ఎవరూ హాజరుకాకుండా ఆయనకు గుణపాఠం చెప్పాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో… మరో సారి ఏపీ గుర్తుకొచ్చిందంటూ విమర్శించారు.  ప్రధాని మోడీ రాజధానిలో పనులు చూసేందుకు గానీ, పోలవరం పనులు పరిశీలించేందుకుగానీ వస్తే బాగుండేదన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల పనుల పరిశీలనకు రాకుండా పార్టీ కార్యక్రమానికి రావడమే మోడీ రాజకీయమని విమర్శించారు. జనవరి 1న చేపట్టనున్న భాజపాకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొని, శాంతియుతంగా నిరసనలు తెలపాలన్నారు. మోడీ గుంటూరు పర్యటనపై జగన్‌, పవన్‌ ఎందుకని నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. మోడీ పర్యటనపై చంద్రబాబు నాయుడు ఇంతగా ఉలిక్కి పడటాన్ని సొంత పార్టీ నేతలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news