ట్రైన్‌లో దొంగలున్నారా? భయపడకండి ఈ నంబర్‌కు కాల్‌ చేయండి! 

-

భారతీయ రైల్వేలో నూతన హెల్ప్‌ లైన్‌ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్ని సేవలకు ఈ నంబర్‌ పని చేస్తుంది. అందుకే మీరు ఈ నంబర్‌ గుర్తు పెట్టుకోండి.మీరు రైల్వే ప్రయాణం ఎక్కువగా చేస్తున్నట్లయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. భారతీయ రైల్వే ఇటీవలే ఒక∙కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్‌ రైల్వే హెల్ప్‌ లైన్‌ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే ‘139’ ఈ నంబర్‌కు కాల్‌ చేస్తే చాలు.. రైల్వే సేవలను పొందొచ్చు. రైలు ప్రయాణం సమయంలో ప్రయాణికులకు సర్వీసులకు 139 నంబర్‌కు కాల్‌ చేసి పొందొచ్చు. ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు చాలా ఊరట కలుగనుంది. పలు రకాల నంబర్ల కారణంగా ప్యాసింజర్లు ఇబ్బంది పడేవారు.

2021 ఏప్రిల్‌ 1 నుంచి 182 నంబర్‌ కూడా పని చేయదు. 139 నంబర్‌ 12 భాషల్లో అందుబాటులో ఉంటుంది. స్టార్‌ గుర్తును క్లిక్‌ చేస్తే మీరు నేరుగా కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడవచ్చు. లేదంటే ఐవీఆర్‌ఎస్‌ సేవలు కూడా పొందవచ్చు.

భారతీయ రైల్వే గత ఏడాది పలు రకాల నంబర్లను నిలిపివేసింది. రానున్న రోజుల్లో ఏ ఇతర నంబర్లు పని చేయవు. కేవలం 139 నంబర్‌ మాత్రమే పనిచేస్తుంది. రైల్వే ప్రయాణికులకు ఈ నంబర్‌కు మాత్రమే కాల్‌ చేయాల్సి ఉంటుంది. వారికి అవసరమైన సమాచారం పొందొచ్చు. లేదంటే ఏదైన ఫిర్యాదు చేయొచ్చు.

సెక్యూరిటీ అండ్‌ మెడికల్‌ సేవల కోసం ప్యాసింజర్లు 139 నంబర్‌కు కాల్‌ చేసిన తర్వాత 1 నంబర్‌పై ప్రెస్‌ చేయాలి. ఆ వెంటనే కాల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌కు లైన్‌ కనెక్ట్‌ అవుతుంది. ఎంక్వైరీ కోసం అయితే ‘2’ నంబర్‌ ప్రెస్‌ చేయాలి. సబ్‌ మెనూలో పీఎన్‌ఆర్‌ స్టేటస్, ట్రైన్‌ ప్రస్తుత స్టేటస్‌ తెలుస్తుంది, రైల్వే ఛార్జీలు , టికెట్‌ బుకింగ్, క్యాన్సలేషన్, వేకప్‌ అలారమ్, వీల్‌చైర్‌ బుకింగ్, మీల్‌ బుకింగ్‌ వంటి ఇతర సేవలు పొందవచ్చు. జనరల్‌ కంప్లైంట్స్‌ కోసం 4 నొక్కాలి. విజిలెన్స్‌ సంబంధిత ఫిర్యాదులకు 5 ప్రెస్‌ చేయాలి. పార్సిల్‌ అండ్‌ గూడ్స్‌ సంబంధిత వివరాల కోసం 6 నొక్కాలి. ఐఆర్‌సీటీసీ రైళ్ల వివరాల కోసం 7ను క్లిక్‌ చేయాలి. ఫిర్యాదుల స్టేటస్‌ తెలుసుకోవడానికి 9 నొక్కాలి.

Read more RELATED
Recommended to you

Latest news