అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌12 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

-

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎమ్‌12 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను గురువారం విడుద‌ల చేసింది. ఎమ్ సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఆక్టాకోర్ ఎగ్జినోస్ 850 ప్రాసెసర్‌, 6 జీబీ ర్యామ్‌లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఇందులో ల‌భిస్తుంది. వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేయ‌గా దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తోంది.

Samsung Galaxy M12 smart phone launched in india

శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌12 ఫీచ‌ర్లు…

* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, 720×1600 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఎగ్జినోస్ 850 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్
* 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11
* 48, 8, 5, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌12 స్మార్ట్ ఫోన్ బ్లాక్‌, బ్లూ, వైట్ క‌ల‌ర్ వేరియెంట్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.10,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.13,499 గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 18వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల‌తో ఈ ఫోన్‌పై రూ.1000 వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news