కె.జి.ఎఫ్ డైరక్టర్ తో ప్రభాస్..!

-

ఒకప్పుడు ఒక భాషలో సినిమా తీస్తే వేరే భాషలో రిలీజ్ అవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. సూపర్ హిట్ అయితే కనుక రైట్స్ కొనేసి రీమేక్ చేసేస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో కూడా కొన్ని తమిళ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ పై సత్తా చాటుతున్నాయి. ఇక ఇప్పుడు కన్న సినిమాల వంతు వచ్చింది. కన్నడ సినిమాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ అవడం చాలా అరుదు. అయితే ప్రస్తుతం యశ్ నటించిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయ్యింది.

రెండు తెలుగు సినిమాలతో పోటీగా వచ్చిన కె.జి.ఎఫ్ సినిమా తెలుగులో మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన కె.జి.ఎఫ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అదరగొట్టింది. అయితే ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరోయిజం చూపించిన తీరుకి ప్రభాస్ కూడా ఫ్లాట్ అయ్యాడట. అందుకే ప్రభాస్ కు సరిపోయే కథ సిద్ధం చేయమని చెప్పారట యువి క్రియేషన్స్ వారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు ఆ సినిమా కూడా సుజిత్ డైరక్షన్ లో యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఆ తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో కూడా మూవీ ఉంటుందని తెలుస్తుంది. మరి ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news