పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద జరిగిన దాడి మీద రాజకీయ దుమారం రేగుతోంది. మొన్న నందిగ్రామ్ దగ్గర సీఎం మమతా బెనర్జీ కి గాయాలయ్యాయి. తన మీద నలుగురైదుగురు కలిసి దాడి చేశారని సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కలకత్తాలోని ఎస్కెఎస్ కె ఎం హాస్పిటల్లో మమత చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆమె డిశ్చార్జ్ అయ్యారు.
గాయాల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డానని మమత చెబుతున్నారు. ఇక మమత మీద దాడి ఘటనలో కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందింది. మమత మీద ఎలాంటి దాడి జరగలేదని ఈసీ పరిశీలకులు పేర్కొన్నారు. బెంగాల్ సీఎంకు భారీగా సెక్యూరిటీ ఉంది అని, మమత మీద దాడి జరిగే అవకాశమే లేదని నివేదిక ఇచ్చారు. ఇక ఈరోజు బీజేపీ మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తెచ్చుకున్నారు.