మహిళల పేరిట హోమ్ లోన్ తీసుకుంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి..!

-

హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మహిళల పేరిట లోన్ తీసుకోండి. దీనితో మీకు బెనిఫిట్స్ కలుగుతాయి. మహిళలను ప్రోత్సహించడానికి, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి అనేక బ్యాంకులు అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి గమనించండి.

మహిళా కోసమే ప్రత్యేకంగా పథకాలను కూడా తీసుకు వచ్చారు. ప్రభుత్వం కూడా అనేక రాయితీలు కల్పించి మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తోంది. మీపై వడ్డీ భారం తగ్గుతుంది. సాధారణంగా పురుషుల తో పోలిస్తే మహిళలకు 50 నుంచి 100 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీ రేటుకే రుణాలను అందిస్తున్నాయి.

దీనితో మహిళలకు నెలవారీ ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. అయితే దీనికి సమబందించి వివరాలని చూస్తే… మహిళలు తీసుకునే హోమ్​లోన్​పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కేవలం 6.80 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తోంది. పురుషులకి అయితే 7% వడ్డీ రేటును వసూలు చేస్తుంది.

అంతే కాదండి మహిళా కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫీజు వంటి వాటిపై రాయితీ లభిస్తుంది. అన్ని రాష్ట్రాలు పురుషుల నుండి 6 శాతం, మహిళల నుండి 4 శాతం మేర స్టాంప్​ డ్యూటీ వసూలు చేస్తాయి. అందువల్ల మీ ఇంటికి భార్యను సహ యజమానిగా చేరిస్తే స్టాంప్​ డ్యూటీ తగ్గించుకోవచ్చని గుర్తించుకోండి. హోమ్​లోన్​ ఎలిజిబిలిటి, డబుల్​ టాక్స్​ బెనిఫిట్స్​, సులభంగా వారసత్వ బదిలీ వంటి మూడు ప్రయోజనాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news