తిరుపతి ఉప ఎన్నికల ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త పట్టుదలగా వ్యవహరించి ఉంటే కచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేసి ఉండేది. కానీ భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా కూడా భయపడి వెనక్కి తగ్గారా అనే అభిప్రాయం జనసేన పార్టీ నేతలలో కూడా వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ విషయంలో ఒక వ్యూహాత్మక అడుగు వేశారు అనే భావన కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.
ఎందుకు అనేది ఒకసారి గమనిస్తే తిరుపతి పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే కనీసం ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా పార్టీకి వచ్చే అవకాశం ఉండదు. భారతీయ జనతా పార్టీపై మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని సామాజిక వర్గాలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో జరుగుతున్న దళిత వ్యతిరేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీని ఇక్కడ కచ్చితంగా ఇబ్బంది పెట్టవచ్చు.
కాబట్టి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది అనే భావన కూడా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సహకారం లేకపోయినా జనసేన పార్టీ నేతలు సమర్ధవంతంగా పని చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తన స్థాయికి తగిన విధంగానే మంచి ప్రదర్శన ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బిజెపిని పక్కన పెట్టడానికి ఒక మంచి అవకాశం అని కాబట్టి జనసేన పార్టీ నేతలు సైలెంట్ గా ఉండటం మంచిది అని కొంత మంది కోరుతున్నారు.