ఎల్ఐసీ హోమ్‌లోన్ తీసుకున్న వారికి బంపర్ ఆఫర్.. ‘గ్రిహా వరిష్ట’ కింద 6 ఈఎంఐలు మాఫీ..!

-

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ).. తన అనుబంధ సంస్థ అయిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్) తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్ తన ప్రత్యేక గృహ రుణ ఉత్పత్తి ‘గ్రిహా విరిష్ట’ కింద 6 ఈఎంఐలను మాఫీ చేస్తున్నట్లు వెల్లడించింది. రియల్ ఏస్టేట్ రంగంలో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎల్ఐసీ ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో గృహరుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసినట్లయితే బిల్డర్ ఆ ఇంటిని మీకు అప్పగించిన తర్వాత.. మీకు లోన్ ఇచ్చిన 48 నెలల తర్వాత అసలు కట్టాలి. లోన్ మంజూరు అయినప్పుడే ఈఎంఐలు చెల్లించాల్సిన భారం ఉండదు. ఈ స్కీమ్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేలు, రక్షణ, బ్యాంకు, ప్రభుత్వ రంగ బీమా సంస్థల ఉద్యోగులకు మేలు జరగనుంది.

గృహ రుణం
గృహ రుణం

ఎల్ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్ ఎండీ, సీఈఓ వై. విశ్వనాథగౌడ్ మాట్లాడుతూ.. గ్రిహా వరిష్ట స్కీమ్‌ను జూలై 2020లో ప్రారంభించామన్నారు. ఈ స్కీమ్‌కు ప్రత్యేక బెనిఫిట్స్ ఉండటం వల్ల ఆదాయం పెరిగిందన్నారు. కంపెనీ రూ.3000 కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు పంపిణీ చేసిందన్నారు. స్కీమ్ బెనిఫిట్స్ అందరికీ ఉపయోగపడేలా వినియోగదారులకు 6 ఈఎంఐల మినహాయింపు ఇస్తున్నామని, దీంతో చాలా మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. వినియోగదారుడు ఇళ్లును లేదా ఫ్లాట్‌ను కొనుగోలు చేసినా ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ల్యాండ్ కొనుగోలు చేసినప్పుడు బిల్డర్ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. అప్పుడు మీరు ఎంచుకున్న ఈఎంఐలల్లో ఆరింటిని మాఫీ చేస్తామన్నారు. ఈ ఆరు ఈఎంఐల మినహాయింపు 37,38, 73, 74, 121, 122వ ఈఎంఐలకు వ్యతిరేకంగా ఇవ్వబడుతుందన్నారు. గ్రిహా వరిష్ట స్కీమ్ కింద ఒక వినియోగదారుడు 65 ఏళ్ల వయసులో కూడా గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 30-80 ఏళ్ల వయసు వరకు రుణ పదవీకాలం ఉంటుందని, అధిక రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే పిల్లల సంపాదనతో సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చని వై.విశ్వనాథగౌడ్ తెలిపారు.

సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువగా ఉన్న వినియోగదారులు రూ.15 కోట్ల వరకు రుణాన్ని పొందవచ్చు. దీనిపై 6.9 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ రుణ పోర్ట్‌ఫోలియో డిసెంబర్ నెల త్రైమాసికంలో (క్యూ-3 ఎఫ్‌వై-21) 13.3 శాతం పెరిగి.. రూ.2.06 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో నికర లాభంలో సంవత్సరానికి 0.2% వృద్ధితో రూ.567.53 కోట్ల లాభం నమోదు చేసింది. ప్రస్తుతం మొత్తం ఆదాయం 12.5% పెరిగి రూ.4,996.45 కోట్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news