అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అన్ని కులాల వారికి సమాన అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ఇవాళ ప్రారంభమైంది. తాజాగా ప్రజా భవన్ లో మీడియాతో మాట్లాడారు భట్టి విక్రమార్క. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే సర్వే చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు కులగణన చేపట్టామని.. ఈ సర్వే ద్వారా శాస్త్రీయమైన సమాచారం అందుతుందని సమాచారం మయేరకు రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయం అందరికీ అందించడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.
సిద్దంగా ఉంచుకోవాల్సినవి ఇవే :
కులగణన సర్వే సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ధరణి పట్టా పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో సర్వే త్వరితగతిన పూర్తి చేయడానికి ఉపయోగ పడుతుందన్నారు. సర్వే కోసం ఎన్యుమరేటర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చి సర్వే కోసం ఎన్యుమరేటర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చి సర్వే కోసం ఎన్యుమరేటర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చి సర్వేకు సిద్ధం చేశామని తెలిపారు.