షర్మిలది తెలంగాణ వ్యతిరేక పార్టీ.. ఈటెలతో కేసీఆర్ కొత్త పార్టీ ?

-

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ ను వీడి పది రోజులు అయింది అని ఆయన పేర్కొన్నారు. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని అది కూడా కేసీఆర్ మూడేళ్లు వెంటపడితే కాదనలేక వచ్చాను అని చెప్పుకొచ్చారు. అయితే తాను అనుకున్నంతగా మార్పు కేసీఆర్ తేలేకపోయారు అని అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరానని అన్నారు. అయితే తెలంగాణ ఆర్థికంగా వెనక్కి పోయిందని ఇటీవల కాగ్ నివేదిక కూడా ఇదే బయటపెట్టిందని ఆయన పేర్కొన్నారు. జిఓ నెంబర్ 111 మీద కేసీఆర్ అబద్ధాలు చెప్పారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అలాగే ప్రభుత్వం మీద ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడలేక పోతుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో సగం మంది అమ్ముడుపోయారని ఆయన విమర్శించారు. అయితే తెలంగాణకు మరో ప్రాంతీయ పార్టీ అవసరం అని పేర్కొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి మళ్లీ రీజినల్ పార్టీలు ఎక్కువైతే అది టిఆర్ఎస్కే లాభం కలుగుతుందని అన్నారు. తాను సొంతంగా పార్టీ పెట్టాలా ? లేక స్వతంత్రంగా పోటీ చేయాలా లేక కాంగ్రెస్ లోనే ఉండాలా లేదా బీజేపీలో చేరాలా అనే దాని మీద కరకాల ఆలోచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తన సోదరుడు కొండా రాఘవరెడ్డి షర్మిల వెంట నడుస్తున్న నేపథ్యంలో తాను కూడా పార్టీలో చేరుతానని ప్రచారం జరుగుతోందని అయితే పార్టీలో చేరే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు షర్మిల పార్టీ తెలంగాణ వ్యతిరేకి అని ఆయన అన్నారు. అయితే మంత్రి ఈటల రాజేందర్ అపాయింట్మెంట్ అడిగానని ఆయన బయట తిడుతున్నాడు మళ్లీ లోపలికి వెళ్తున్నాడు అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే ఈటెలతో కేసీఆర్ కొత్త పార్టీ పెట్టే అవకాశం కూడా లేకపోలేదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news