తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎటు వెళ్తారు ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం ఆయన టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆయనకు టిఆర్ఎస్ పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు అనే ఆవేదన ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఆయనకు బలమైన వర్గం ఉంది. టిఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు ఆయనతో సన్నిహితంగా ఉంటారు.
ఆయన అభిమానులు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. నల్గొండ జిల్లాలో కూడా ఆయనకు అభిమానులు బలంగానే ఉన్నారు. ఖమ్మం పార్లమెంట్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా మంచి మెజారిటీతో ఆయన ఎంపీగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆయన విషయంలో షర్మిల చాలావరకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. వాస్తవానికి వైఎస్ కుటుంబంపై అభిమానం ఆయనకు ఎక్కువగా.
ఆయన విషయంలో ముఖ్యమంత్రి జగన్ కూడా చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. అందుకే షర్మిల పార్టీలోకి ఆయన వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. షర్మిలకు జగన్ కు మధ్య విభేదాలు ఉంటే మాత్రం ఆయన పార్టీలోకి వెళ్లకపోవచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయాన్ని మార్చే అవకాశం ఉండవచ్చు. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలోనే షర్మిలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.