అందమైన ప్రకృతి, పక్షుల కిలకిలలు, ఎత్తు నుండి కిందకి జారే జలపాతాలు. అబ్బా చూడడానికి ఎంత బాగుంటుందో కదా…! నిజంగా జలపాతాలకి వెళ్లడం చాలా బాగుంటుంది. పైగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూడటానికి ఇష్టపడతారు. మీకు వీలు అయితే తప్పకుండా ఈ ప్రదేశాలు సందర్శించండి.
నిజంగా ఈ రమణీయమైన ప్రదేశాలకి వెళితే అవి మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కొద్ది మందికి మాత్రమే తెలిసిన అద్భుతమైన జలపాతాల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం పూర్తిగా చూసేయండి.
అతిరాపల్లి జలపాతాలు:
అతిరాపల్లి జలపాతాలు కేరళ, తిసుర్ జిల్లాలో ఉన్నాయి. ఇవి చాలా అందంగా ఉంటాయి. చుట్టూ పచ్చని చెట్లు తో ఈ జలపాతాలు చూడడానికి చాలా బాగుంటాయి. పైగా ఇక్కడ వలస పక్షులు ప్రధాన ఆకర్షణీయం.
చిత్రకూట్ జలపాతాలు:
చిత్రకూట్ జలపాతాలు కోసం మీరు వినే ఉంటారు. ఇవి ఛత్తీస్గఢ్ లో ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రకృతి చాలా బాగుంటుంది. అనేక ప్రాంతాల నుంచి చిత్రకూట్ జలపాతాలు చూడడానికి వస్తూ ఉంటారు. ఇది కూడా తప్పక చూడాల్సిందే.
జన జలపాతము:
మనాలిలో ఈ జలపాతాలు ఉన్నాయి. మ్యాన్లీ కి 35 కిలోమీటర్ల దూరం ఈ జలపాతాలు పైన్, ఆపిల్ చెట్ల మధ్య ఉంటాయి. ఎత్తయిన ఈ జలపాతాలు చూడదగ్గవి.
రహల జలపాతాలు:
ఈ జలపాతాలు మనాలి నుంచి రోతంగ్ పాస్ రోడ్ లో ఉంటాయి. చుట్టూ అడవులు మధ్య ఈ జలపాతాలు ఉంటాయి. వీలైతే వీటిని కూడా చూడండి.
హిడ్లుమనే జలపాతాలు :
ఇవి కర్ణాటక షిమోగా జిల్లాలో ఉన్నాయి. అడవుల మధ్య ఈ జలపాతాలు ఉన్నాయి. పైగా ఈ జలపాతాన్ని చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. అందంగా ఉంటే ఈ జలపాతాలని కూడా తప్పక చూడాలి.