పోస్టాఫీసులో మీకు ఎకౌంట్ వుందా..? అయితే తప్పక ఈ కొత్త రూల్స్ కోసం తెలుసుకోవాలి. ఇక మరి ఆ రూల్స్ ఏమిటి అనేది ఇప్పుడే తెలుసుకోండి. వివరాల లోకి వెళితే.. ఇక పై పోస్టాఫీసు పథకాల నుండి డబ్బులు ఉపసంహరణ రూ. 20 లక్షలకు మించితే టీడీఎస్ తగ్గింపు కోసం ఇండియన్ పోస్ట్ కొత్త నిబంధనలను తీసుకు రావడం జరిగింది.
పీపీఎఫ్ ఉపసంహరణలకు కూడా ఈ రూల్స్ వర్తిస్తాయట. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 194N ప్రకారం సవరించిన నిబంధనలకు అనుగుణంగా, గడిచిన మూడు అసెస్‌మెంట్ సంవత్సరాలకు గానూ పెట్టుబడిదారుడు ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను (ఐటిఆర్) దాఖలు చేయకపోతే, అప్పుడు ఉపసంహరణ మొత్తం నుంచి టీడీఎస్‌ను కట్ చేయాల్సి ఉంటుంది.
ఇక టీడీఎస్ రూల్స్ ని చూస్తే… పోస్టాఫీస్ ఎకౌంట్ లో రూ. 20 లక్షలు దాటి, రూ. 1 కోటి మించకపోతే అప్పుడు రెండు శాతం చొప్పున టీడీఎస్‌ను రూ. 20 లక్షలు దాటిన మొత్తానికి చెల్లించాల్సి వస్తుంది. ఈ కొత్త రూల్స్ జూలై 1 నుంచి అమలు లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఆర్ధిక సంవత్సరం లో రూ. 1 కోటి దాటితే, అప్పుడు 5 శాతం చొప్పున టీడీఎస్‌ను రూ. 1 కోటి దాటిన మొత్తానికి చెల్లించాలి గమనించండి.
టీడీఎస్‌ను సవరించడం లో సులభతరం చేయడానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (సిఈపిటి) 2020 ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 31 వరకు మధ్య కాలం లోని డిపాజిటర్ల వివరాలను సేకరించారు. సిఈపిటి ఖాతాదారుడి పాన్ నెంబర్, టీడీఎస్ రూపంలో కట్ చేయాల్సిన నగదు డీటెయిల్స్ ని ఇచ్చింది.