CBSE-CSIR ఇనోవేషన్ అవార్డు.. గెలిచిన వాళ్లకి లక్ష రూపాయలు…!

-

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సి ఎస్ ఐ ఆర్ తో కలిసి ఒక మంచి ఆలోచననని పిల్లల కోసం తీసుకురావడం జరిగింది. సీబీఎస్ఈ విద్యార్థుల కి ఒక పోటీని తీసుకురావడం జరిగింది దానిలో గెలిచిన వాళ్లకి లక్ష రూపాయలు.

సామాజిక సమస్యలను బాగా చూపించే 15 మంది విద్యార్థులకి 10,000 నుంచి 50,000 వరకు బహుమతి ఇవ్వనున్నారు. దీనికి గల కారణం ఏమిటంటే పిల్లల్లో రీసెర్చ్ మరియు సైన్స్ ని ప్రమోట్ చేయాలని. అందుకే దీని పేరు ‘ఇన్నోవేషన్ అవార్డు ఫర్ స్కూల్ చిల్డ్రన్’.

విద్యార్థులు సీబీఎస్సీ అకాడమిక్ వెబ్ సైట్ cbseacademic.nic.in ని చూసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఏప్రిల్ 30 2021 నాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోటీకి అర్హులు. ఇందులో పాల్గొనడానికి పిల్లలు అక్కడ ఉన్న స్కూల్ వివరాలకి పంపాల్సి ఉంటుంది.

దీనిలో మొదటి బహుమతి లక్ష రూపాయలు
రెండో బహుమతి 50 వేల రూపాయలు (రెండు అవార్డులు)
మూడవ బహుమతి 30000 రూపాయలు (మూడు అవార్డులు)
నాల్గవ బహుమతి 20000 రూపాయలు (నాలుగు అవార్డులు)
ఐదవ బహుమతి పది వేలు రూపాయలు (ఐదు అవార్డులు)

Read more RELATED
Recommended to you

Latest news